తండ్రి కొడుకుల ఛాలెంజ్ …

షుగర్ వ్యాధి లేనివాళ్లు, రాణి వాళ్ళు అంటే దొరకడం కష్టమనే అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక వయసు నుంచి షుగర్ వ్యాధి మొదలవుతుంది. అందుకే మనిషి షుగర్ వ్యాధి అంటే ఒక మామూలు సెర్టిఫికెట్ లా ఫీల్ అవ్వడం కూడా మొదలు పెట్టాడు. కానీ షుగర్ వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది నార్మల్ లో ఉంటేనే మిగిలిన ఏ అనారోగ్యం వచ్చినా తగ్గించుకోగలరు. అదే షుగర్ వ్యాధిగాని ఉంటె, మిగిలిన సమస్యలు కూడా తగ్గవు. అందుకే ఒక రోగికి ఏ వైద్యం చెయ్యాలి అనుకున్నా, ముందుగా షుగర్, బీపీ ఎలా ఉన్నాయో చెక్ చేస్తారు. దానిని బట్టి వారికి ట్రీట్మెంట్ మొదలు పెడతారు.

Best phone for best price. click on image

ఎండాకాలం వచ్చింది అంటే చాలామందిలో అనేక సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎండాకాలం రాగానే అందరికీ అనిపించే కోరిక ఏమిటంటే… కూల్ డ్రింక్ తాగాలి అని. ఎందుకంటే విపరీతమైన వేడి ఉండటం వలన బయటకు వెళ్తే, కొంచెం సేపటికి కూల్ డ్రింక్ తాగటం అలవాటుగా మారుతుంది. కానీ షుగర్ వ్యాధి ఉన్నవారు, కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. బయట తాగే కూల్ డ్రింక్స్ లో షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వలన షుగర్ చాలా వేగంగా పెరుగుతుంది. ఎంత ఎండాకాలం అయినప్పటికి దాహం వేస్తే, నీళ్లు తాగాలి. ఒకవేళ నీరు ఎక్కువగా తాగాలని అనిపించకపోతే, పల్చని మజ్జిగ చేసుకుని తాగావచ్చు.

అలాగే వేసవిలో మామిడి పండ్లు బాగా దొరుకుతాయి. వాటిని కూడా చాలా లిమిటెడ్ గా తీసుకోవాలి. సీజన్ ఉన్నన్నిరోజులే తింటాం కదా అని ఎక్కువగా తినకూడదు. అలానే వాటర్ మిలాన్ కూడా ఎక్కువుగా తినకూడదు. అందులో ఏముంది నీరే కదా అని చాలామంది అనుకుంటారు. నిజమే పుచ్చకాయ తినడం చాలా మంచిది. కానీ దానిని కూడా లిమిటెడ్ గానే తినాలి. అలాగే కొబ్బరి నీళ్లు కూడా ఎండాకాలం ఎక్కువగా తీసుకుంటాం. దానిని కూడా షుగర్ ఉన్నవారు ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే దాని వలన కూడా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. అసలు షుగర్ ఉన్నవారు ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది తెలియాలంటే పై వీడియో చూడండి…

Share on Whatsapp