సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై పోస్టుమార్టం రిపోర్ట్…

ఈ స్టార్ హీరోయిన్స్ కి సైకయాట్రీ ప్రొబ్లెమ్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా?

ఈరోజుల్లో నూటికి 20 మందికి మానసిక సమస్య అనేది ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉంటున్నాయి. కాలం మారే కొద్దీ, జనాభా పెరగటంతో పాటు, వారి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానితో మనిషి పోటీ స్వభావం ఎక్కువ అవుతుంది. దానితో పాటు పని వత్తిడి కూడా పెరుగుతుంది. వీటన్నిటి వలన కొందరు భరించలేక మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే ఈ సమస్య వచ్చింది అని గుర్తించడం మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. తరవాత నిమ్మదిగా అర్ధం అవుతుంది. ఈ సమస్యను ఎవరికి వారు ఎనలైజ్ చేసుకోవాలి. అలాగే వారితో పాటు ఉన్నవారు, వారిలో లోపాన్ని, కొత్తగా వచ్చిన మార్పులను గుర్తించాలి.

చాలామందిలో మానసిక సమస్య అనగానే అదేదో పిచ్చి అని ఫీల్ అయిపోతూ ఉంటారు. దానివలన వారు ఎందుకు వేదన పడుతున్నారో ఎవ్వరితోనూ పంచుకోరు. ఇలా వారిలో వారే ఎక్కువగా బాధపడుతూ ఉండటం వలన సమస్య ఇంకా పెద్దది అవుతుంది. ఇలా సమస్య పెంచుకోవడం వలన వారు ఇంకా అనారోగ్యానికి గురి అవుతారు. అలా కాకుండా ప్రతీ మనిషి ఎవరో ఒకరు ఇద్దరితో వారి సమస్యలను పంచుకోవాలి. దానికి వారు ఎలాంటి సలహాలను ఇస్తున్నారో చూసుకోవాలి. మన బాధను మనలో ఒక వ్యధలా తయారు చేసుకునే కంటే, ఇతరులతో పంచుకోవడం చాలా మంచిది. దాని వలన కొంతవరకు మనసు తేలిక పడుతుంది.

కొందరు మానసిక సమస్య ఉందని తెలిసినా కూడా ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లరు. ఎందుకంటే వారికి భయం, ఎలాంటి భయం అంటే ఒక్కసారి మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్లామని ఎవరికైనా తెలిస్తే పిచ్చివారు అనుకుంటారని, అలాగే ఒకసారి మందులు వాడటం మొదలు పెడితే జీవితాంతం వాడాల్సి వస్తుందని ఇలాంటి అపోహలతో డాక్టర్ దగ్గరికి వెళ్లడం గాని, ఇతరులకు చెప్పుకోవడం కానీ చెయ్యరు. కానీ అది సరైన పద్ధతి కాదు, సమస్య మొదలులో ఉన్నప్పుడే సారైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే అది మనం తీర్చలేని సమస్యగా మారుతుంది. అసలు మానసిక సమస్య అంటే ఏమిటి? దానిని ఎలా నివారించాలి అనే దాని గురించి పై వీడియో చూడండి…

Lakshmi collection Tissue saree with blouse in light weight. Decent colours and excelent quality.
Price- Rs.715+shipping
cash on delivery and online payment also avaialable
contact- whatsapp 9618889285

https://lakshmicollection9.com/product/lakshmi-collection-tissue-saree-with-blouse-in-light-weight/

Share on Whatsapp